

లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ‘దండోరా’ చిత్రం డిసెంబర్ 25 న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటించారు. సక్సెస్ మీట్లో శివాజీ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి 2026 మొత్తం ప్రేక్షకులు మాట్లాడుకుంటారని పేర్కొన్నారు.
కంటెంట్ ఆధారిత సినిమాగా ‘దండోరా’ ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలతో ముందుకు సాగుతోందని టీమ్ సభ్యులు తెలిపారు. నవదీప్ ఈ సినిమాకు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చెప్పగా, నిర్మాత రవీంద్ర బెనర్జీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరారు. దర్శకుడు మురళీకాంత్ ఈ సినిమా మూడున్నరేళ్ల కష్టానికి ఫలితమని పేర్కొంటూ, ప్రతి పాత్ర పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్తో నిలిచిందని అన్నారు. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో సినిమా మరింత బలంగా ముందుకు సాగుతోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!