

హైదరాబాద్ సినీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐమాక్స్ అనుభూతి మరోసారి నగరంలో అందుబాటులోకి రానుంది. ఏషియన్ సినిమాస్ మరియు ఐమాక్స్ కార్పొరేషన్ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మహేష్ బాబు భాగస్వామ్యంలోని ఏఎంబీ సినిమాస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్‌లో అత్యాధునిక ‘ఐమాక్స్ విత్ లేజర్' స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గతంలో ప్రసాద్స్ ఐమాక్స్ భారీ తెర, అద్భుతమైన సౌండ్ సిస్టమ్, అత్యుత్తమ చిత్ర నాణ్యతతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే 2015 తర్వాత అక్కడ ఐమాక్స్ ప్రదర్శనలు నిలిచిపోవడంతో ప్రేక్షకులు ఆ అనుభూతికి దూరమయ్యారు. ఇప్పుడు మరింత ఆధునిక సాంకేతికతతో అదే అనుభూతిని తిరిగి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశంలో ఏర్పాటు కానున్న మూడు కొత్త ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్లలో తొలి ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ ఎంపిక కావడం విశేషం. 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!