
న్యూస్

‘పుష్ప-2’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ గౌరవం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇంత గొప్ప అవార్డు అందించిన ఫిల్మ్ ఫేర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా అభిమానులు చూపుతున్న ప్రేమ, ఆదరణ తనకు మరింత బాధ్యతను కలిగించిందన్నారు.
తనపై చూపుతున్న అభిమానుల అపారమైన ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ కృతజ్ఞుడినని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ అవార్డును హద్దుల్లేని తన అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆనందాన్ని కలిగించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!