

అందం కంటే అభినయానికి ప్రాధాన్యం ఇచ్చే నటీమణుల్లో ఐశ్వర్య రాజేశ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్‌గా మారిన ఆమె, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ భార్యగా భాగ్యలక్ష్మి పాత్రతో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో, ఐశ్వర్య కెరీర్ పూర్తిగా మారబోతుందన్న చర్చ ఇండస్ట్రీలో బాగా నడిచింది.
అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అంచనాలు నిజం కాలేదని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు. సినిమా తర్వాత వరుసగా పెద్ద హీరోల అవకాశాలు వస్తాయని ఆశించినప్పటికీ, అవి రాలేదని చెప్పారు. టాలీవుడ్లో ఇప్పటికీ తనను హీరోయిన్గా పూర్తిగా అంగీకరించలేదేమో అన్న భావన తనలో ఉందని తెలిపారు. అయినప్పటికీ, కథాబలం ఉన్న పాత్రలు చేస్తూ సంతృప్తిగా ఉన్నానన్నారు. 21 ఏళ్ల వయసులోనే కాకా ముట్టైలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎలాంటి పాత్రకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. రెండు జెళ్ల సీత (1983)లో నటించిన రాజేశ్ కుమార్తె అయిన ఐశ్వర్య, తమిళ హిట్ కనా రీమేక్ కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఓ.. సుకుమారి చిత్రంతో పాటు కోలీవుడ్‌లోనూ బిజీగా కొనసాగుతుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!