

హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి 22 సంవత్సరాలు అయినా కూడా, నయనతారకు ఇంకా కథానాయికగా వరుసగా సినిమాలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. ఆమె ఎందుకు ‘లేడీ సూపర్ స్టార్’ అనిపించుకున్నారో ఆమె డిమాండ్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం నయనతార చేతిలో ఒక్కటి–రెండు కాదు, మొత్తం తొమ్మిది సినిమాలు ఉన్నాయి. కొత్త సినిమాలు సైన్ చేయడానికి కూడా కాల్షీట్లు లేక వేచి ఉండాల్సి వస్తోంది.
ఇటీవల బాలకృష్ణ–గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందనున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నయనతారను హీరోయిన్గా ఫైనల్ చేశారు. బాలయ్యతో ఇది నాలుగోసారి జట్టు కట్టడం కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది.
చిరంజీవితో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల అవుతోంది. యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకుని మార్చిలో విడుదలకు సిద్ధమైంది. సుందర్ సి తెరకెక్కిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి సీక్వెల్) చిత్రం నయనతార పేరుతోనే భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్లో సగం ఓటీటీ డీల్ ద్వారా రికవర్ అయినట్లు సమాచారం.
అదనంగా, మలయాళ చిత్రాలు ‘డియర్ స్టూడెంట్స్’, ‘పాట్రియట్’ తో పాటు, తమిళ సినిమాలు ‘మన్నన్ గట్టి సిన్స్ 1960’, ‘హాయ్’, ‘రక్కయి’ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి అన్నీ 2026లో ప్రేక్షకులను పలకరించనున్నాయి.
శ్రీలీల, రష్మిక మందన్న వంటి యువ హీరోయిన్స్ దూసుకుపోతున్న సమయంలోనూ నయనతార ఇంత డిమాండ్‌లో ఉండటం విశేషం. ఇద్దరు పిల్లల తల్లిగా ఉండి కూడా షూటింగ్ షెడ్యూల్స్‌ను సమర్థవంతంగా నిర్వహించడం చిన్న విషయం కాదు.
భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ డిసెంబర్ మూడో వారం విడుదల కానుంది. ఇందులో నయనతార నటించకపోయినా, విగ్నేష్ సుదీర్ఘ గ్యాప్ తర్వాత హిట్ కొడతాడనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
త్రివిక్రమ్–వెంకటేష్ సినిమాకు కూడా నయనతారను సంప్రదించినా, చివరకు ఆ కాంబినేషన్ ఆగిపోయింది. మొత్తానికి నయనతార డైరీ చూస్తే, సీనియర్ హీరోయిన్స్‌కు ఈర్ష్య కలగడం సహజం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!