
జనరల్

వచ్చే నెల 4 న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా టిక్కెట్ ధరలను ఏడు రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఉపసంహరించుకుంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు అనుమతిస్తూ కేసును ముగించింది. ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమవుతోందని పేర్కొంటూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
వాదనలు విన్న న్యాయస్థానం, వినతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే తదుపరి విచారణ నాటికి కేసు నిష్ఫలమయ్యే అవకాశం ఉండటంతో పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీనిని అంగీకరించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!