

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన సినిమాలు అందించిన బన్నీ వాసు – వంశీ నందిపాటి జంట మరో ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై రూపొందిన ‘హే భగవాన్’ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, నరేష్, యాంకర్ స్రవంతి ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఫిబ్రవరి) 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తి వినోదంతో పాటు భావోద్వేగాన్ని కలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు.
సినిమాలో ఒక ప్రత్యేకమైన “బిజినెస్” అంశం ఉంటుంది. ఆ అంశం ద్వారా ఒక కొడుకు తన తండ్రిని అర్థం చేసుకునే భావోద్వేగ కథను చూపిస్తారు. ట్రైలర్లో ఆ టాపిక్‌ను ఉద్దేశపూర్వకంగా ఉంచి ఆసక్తి పెంచారని చెప్పారు. సినిమాలో తండ్రి పాత్ర పేరు భగవాన్ కావడంతో ‘హే భగవాన్’ అనే టైటిల్ పెట్టామని, అయితే సెన్సార్ సూచనల కారణంగా టైటిల్ మారే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. ఈ సినిమా సుహాస్ కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
తాను నిర్మాత కంటే క్రియేటివ్ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తానని, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తానని చెప్పారు. చిన్న సినిమాలు తగ్గలేదు, ఇంకా పెరిగాయని, ఓటీటీ మార్కెట్‌పై స్పష్టత వచ్చినప్పటికీ కేవలం ఓటీటీ కోసం కూడా సినిమాలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం చేయబోనని, మంచి సినిమాలు నిర్మించడమే లక్ష్యమని చెప్పారు. పోలీమేర-3 ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని, త్వరలో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తామని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!