

గుర్రం పాపిరెడ్డి చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు మురళీ మనోహర్ తెలిపారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ సినిమాను డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు చూడని కొత్త కథను రూపొందించినట్లు దర్శకుడు చెప్పారు. మొదట “పరమపదసోపానం”గా నిర్ణయించిన టైటిల్‌ను, ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా “గుర్రం పాపిరెడ్డి”గా మార్చినట్లు తెలిపారు. తెలివైనవారు - తెలివితక్కువ వారి మధ్య జరిగే సంఘర్షణలో సహజంగా పుట్టే వినోదాన్ని చూపించడం ఈ చిత్రానికి ప్రధాన కాన్సెప్ట్ అని వివరించారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా పాత్రల్లో సహజత్వం చూపారని, ఫరియా ఒక పాటను రాసి పాడి, కొరియోగ్రఫ్ కూడా చేసినట్లు పేర్కొన్నారు. బ్రహ్మానందం కీలక పాత్రలో నటించగా, చిత్రంలోని సన్నివేశాల కోసం రోబోటిక్ ఆర్మ్ కెమెరాను ఉపయోగించినట్లు చెప్పారు.
యోగి బాబు ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఆయన డేట్స్ కోసం మూడు నెలలు వేచి చూసినట్లు దర్శకుడు అన్నారు. “గుర్రం పాపిరెడ్డి” చిత్రం రెండున్నర గంటలపాటు సాగుతుందనీ, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంజాయ్ అయ్యేలా ఉంటుందని తెలిపారు. అవతార్ విడుదల రోజునే సినిమా విడుదల అవుతున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల మద్దతుపై నమ్మకం ఉందన్నారు. మొదటి చిత్రం “సింబా” కన్నా ఇది పూర్తిగా భిన్నమైన కథా నిర్మాణంతో వస్తోందని, తాను ఎప్పుడూ వేర్వేరు జానర్లలో సినిమాలు చేయాలనుకుంటానని చెప్పారు. ప్రస్తుతం మ్యూజికల్ రొమాంటిక్ మూవీ, హారర్ థ్రిల్లర్ వంటి కొత్త ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు వెల్లడించారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!