
రాజకీయాలు

‘దేవర’ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా స్పందించారు. హీరోలను తెరపై ఆకర్షణీయంగా చూపించడం వెనుక ఎన్నో సాంకేతిక సవాళ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఫ్రేమ్‌లో కనిపించే ప్రతి అంశం ప్రేక్షకుల దృష్టిని ప్రభావితం చేస్తుందని వివరించారు.
‘దేవర’ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ చుట్టూ అత్యంత పొడవైన వ్యక్తులు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రత్నవేలు వెల్లడించారు. వైడ్ షాట్లు, టాప్ యాంగిల్ షాట్లు నటుడిని సహజంగానే చిన్నగా చూపించే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి హీరోకి ప్రత్యేక విజువల్ ట్రీట్‌మెంట్ అవసరమని చెప్పారు. ఇదిలా ఉండగా దేవర పార్ట్ 2పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మరియు డ్రాగన్ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!