

జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసుకు సంబంధించి దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి చుక్కెదురయ్యిందని, కోర్టు ఆదేశాలను ధిక్కరించారని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం నిజం కాదని పేర్కొంది. అలాగే సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ కోర్టు వ్యాఖ్యానించిందన్న వార్తలను కూడా ఖండించింది.
ఫిబ్రవరి 5, 2026 న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని సురేష్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ వెల్లడించింది. సాధారణ న్యాయ ప్రక్రియలో భాగంగా మాత్రమే కేసు 05/02/2026 కి వాయిదా పడిందని తెలిపింది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వాస్తవాలను వక్రీకరించి ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని లీగల్ టీమ్ హెచ్చరించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!