

థియేటర్లో ‘పతంగ్’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి ఆనందం వ్యక్తం చేశారు. తనకు వస్తున్న అభినందనలు చూసినప్పుడు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టుగా అనిపిస్తోందని ఆయన తెలిపారు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ స్పోర్ట్స్ డ్రామాను విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. విడుదలైనప్పటి నుంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
విలేకరులతో ప్రణీత్ మాట్లాడుతూ, రోజు రోజుకు టాక్‌తో పాటు కలెక్షన్లు పెరుగుతున్నాయని, పతాక సన్నివేశాలు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయని తెలిపారు. సీజీ వర్క్‌కి దాదాపు రెండు సంవత్సరాలు పట్టడంతో సినిమా విడుదల ఆలస్యమైందని, అయినా ఎక్కడా క్వాలిటీపై రాజీ పడలేదని చెప్పారు. నిర్మాతల మద్దతే ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అని పేర్కొన్నారు. పండుగ సీజన్ కారణంగా థియేటర్లు పరిమితంగా లభించినా, సినిమా ఆడుతున్న చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదవుతున్నాయని, జనవరి 1 న ఓవర్సీస్లో వైడ్ రిలీజ్ చేయనున్నామని ఆయన వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!