
జనరల్

జ్యోతిష్యుడు వేణుస్వామి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించారు. ముఖ్యంగా చిత్రంలో చూపించిన ఆధ్యాత్మిక ప్రతీకలు, ధూమావతి అమ్మవారి రూపం, కాకి ప్రతీకతో పాటు కీలక యాక్షన్ సన్నివేశాల్లో వినిపించిన మంత్ర ధ్వనులపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక అంశాలను సంప్రదాయ నేపథ్యాన్ని గౌరవిస్తూ మరింత జాగ్రత్తగా చూపించాలని వేణుస్వామి అభిప్రాయపడ్డారు.
సినిమాల్లో దేవతలు, దైవారాధనకు సంబంధించిన అంశాలను చూపించేటప్పుడు వాటి సంప్రదాయ, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని గౌరవించాలని వేణుస్వామి సూచించారు. వినోదం కోసం ఉపయోగించినప్పటికీ ఇలాంటి అంశాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేవతల జోలికి వెళ్లవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!