

హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఇన్ కచేరీ నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా జరిగింది. వేలాది మంది అభిమానుల మధ్య రెహ్మాన్ తన అజరామర గీతాలతో సంగీత మంత్రం వేసి అందరినీ అలరించారు. ఈ కచేరీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పెద్ది సినిమా టీమ్ హాజరు కావడం. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వి కపూర్, దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ వేడుకకు హాజరై, తమ కొత్త పాట “చికిరి” ని ప్రమోట్ చేశారు. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనంగా మారింది. “మస్సా మస్సా” బ్యాక్‌గ్రౌండ్‌లో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగా ప్రేక్షకులు ఉత్సాహంగా హర్షధ్వానాలు చేశారు. రెహ్మాన్‌తో పని చేయడం తన చిన్ననాటి కల అని రామ్ చరణ్ చెప్పగా, జాన్వి కూడా ఇది తన కెరీర్లో మరపురాని అనుభవమని వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో చికిరి పాటను లైవ్‌గా ప్రదర్శించగా ప్రేక్షకులు ఘనంగా స్పందించారు. రామ్ చరణ్, జాన్వి హాజరుతో సినిమా మీద ఉన్న హైప్ మరింత పెరిగింది. విడుదలైన 24 గంటల్లో చికిరి యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ పాటగా నిలిచి, గ్లోబల్ చార్ట్స్‌లో రెండో స్థానాన్ని సాధించింది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మార్చి 27, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏఆర్ రెహ్మాన్ కచేరీలో చేసిన ఈ ప్రమోషన్ సినిమాకు భారీ స్థాయి ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!