

కలర్ ఫొటో, బెదురులంక 2012 వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించగా, శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25 న గ్రాండ్గా విడుదల కానుంది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, “నేను మెదక్ కి చెందిన వాడిని. అమెరికాలో ఉద్యోగం చేసేవాడిని కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో రిస్క్ తీసుకుని తిరిగి వచ్చాను. సమాజంలో ఉన్న అసమానతలపై కథ చెబుదాం అనిపించి ‘దండోరా’ తీశాను,” అన్నారు. ఈ చిత్రం ఒక వ్యక్తి మరణం తర్వాత పూడ్చిపెట్టే వరకు జరిగే సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మతపరమైన, సామాజిక వివక్ష ఎలా ప్రభావం చూపుతుందనే అంశాన్ని చూపించారు. “బలగం సినిమాతో పోలికలేమీ లేవు. దండోరా పూర్తిగా భిన్నమైన కథ,” అని మురళీకాంత్ స్పష్టం చేశారు. అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉందని, బిందు మాధవి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆయన చెప్పారు. మొదట ఈ సినిమాకు అంతిమ యాత్ర అనే టైటిల్ అనుకున్నా, నిర్మాత సూచనతో దండోరా అనే టైటిల్ ఫిక్స్ చేశామని చెప్పారు.
“సినిమా చూస్తే ప్రేక్షకులు కథతో సర్ప్రైజ్ అవుతారు. మార్క్ కె రాబిన్ సంగీతం, ఆర్ఆర్ ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది. ‘దండోరా’ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,” అని దర్శకుడు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!