
జనరల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కిరిక్ పార్టీ’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులో ‘కిరాక్ పార్టీ’, తమిళంలో ‘కోమలి’, ‘పప్పీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2024 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంయుక్త, విక్రమ్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!