

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ముగింపుకు వచ్చేసింది. కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో అన్న భావనతో పాటు, సినిమా ప్రేమికులు చివరి వీకెండ్‌కి థియేటర్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో, సాధారణ శుక్రవారం కంటే ముందే సినిమాల సందడి మొదలైంది.
డిసెంబర్ 25 క్రిస్మస్ వీకెండ్లో భాగంగా తెలుగు, కన్నడ, మలయాళం భాషల నుంచి మొత్తం ఎనిమిది సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే వీటిలో నాలుగు సినిమాలపై మాత్రం ప్రత్యేకమైన బజ్ నెలకొంది. విశేషం ఏంటంటే, ఆ నాలుగు సినిమాలూ తెలుగువే కావడం.
యువ హీరో రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమాపై ఈ వీకెండ్‌కు మంచి అంచనాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో బాగా కనెక్ట్ అయింది. నిర్మాత స్వప్న దత్, దర్శకుడు ప్రదీప్ అద్వైతం ప్లాన్డ్గా చేసిన ప్రచారం సినిమాపై బలమైన బజ్ క్రియేట్ చేసింది.
ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల మంచి హైప్‌తో విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా, అనౌన్స్మెంట్ వీడియో నుంచి క్రమంగా ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఈ వీకెండ్లో ఆడియెన్స్ వాచ్‌లిస్ట్‌లో శంబాల చోటు సంపాదించుకుంది.
హారర్ జానర్‌తో ఏడాదికి ముగింపు ఇవ్వాలనే ఆలోచనతో వచ్చిన సినిమా ఈషా. హెబా పటేల్ నటించిన ఈ చిత్రం మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా, మేకర్స్ చేసిన వినూత్న ప్రమోషన్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. హారర్‌తో పాటు క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండటంతో ఈషా కూడా ఈ వీకెండ్లో చూడాల్సిన సినిమాగా మారింది.
మొత్తంగా ఎనిమిది సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలే బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!