
.png&w=3840&q=75)
దుర్గమ్మ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదంతోపాటు చిత్ర పటాన్ని ఆయనకు ఆలయ అధికారులు అందజేశారు.
ఆ తర్వాత వేద పండితులు ఆయన్ని ఆశీర్వదించారు, ఆలయం బయట అనిల్ రావిపూడి విలేకర్లతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాడిన పాట.. ఈ చిత్రానికే హైలెట్గా నిలుస్తోందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తాను గుంటూరులో చదివిన కాలేజీలో సాంగ్ రిలీజ్ చేయబోతున్నామని వివరించారు. ఈ చిత్రం బాగా వచ్చిందన్నారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!