

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఆయన కెరీర్‌కు మరింత ఊపు రావడంతో వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరు యువ దర్శకులతో సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనుంది. నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో రవితేజ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
మరోవైపు దర్శకుడు హసిత్ గోలితో రవితేజ ఇప్పటికే ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఎస్‌వీసీ64’ వర్కింగ్ టైటిల్‌గా ఉంది. వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రవితేజ ముందుగా ‘ఎస్‌వీసీ64’ షూటింగ్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇరుముడి’ తర్వాత రవితేజ వరుస సినిమాలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!