

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని కుస్తీ సన్నివేశాల గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిత్రంలోని కీలక యాక్షన్ భాగాలను సహజసిద్ధంగా చిత్రీకరించారు. ప్రస్తుతం అనేక చిత్రాలు దృశ్య ప్రభావాలపై ఆధారపడుతున్న సమయంలో ‘పెద్ది’ బృందం నిజమైన యాక్షన్‌కే ప్రాధాన్యం ఇవ్వడం విశేషంగా మారింది.
ఈ చిత్రంలో రెజ్లర్ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక మార్పు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ కఠినమైన సాధన ద్వారా ఆయన ఈ రూపాన్ని సాధించారని చిత్రబృందం తెలిపింది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని భావోద్వేగాలతో నిండిన క్రీడా నేపథ్య కథగా రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!