

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా చిత్రం కాంతా విడుదలకు ముందు వివాదంలో చిక్కుకుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సముతిరఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వే ఫేరర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రముఖ తమిళ నటుడు, గాయకుడు ఎం.కే. త్యాగరాజ భగవతార్ మనవడు బి. త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా తన తాతగారి జీవితం ఆధారంగా ఉందని, ఆయనను ప్రతికూలంగా చూపించారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ, కాంతా బయోపిక్ కాదని, పూర్తిగా కల్పితమైన క్రైమ్ డ్రామా అని స్పష్టం చేశాడు. కొన్ని సృజనాత్మక ప్రేరణలు మాత్రమే తీసుకున్నామని తెలిపారు. మరోవైపు, చెన్నై సివిల్ కోర్టు దుల్కర్ మరియు నిర్మాతలకు నోటీసులు జారీ చేసి, నవంబర్ 18 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నవంబర్ 14 న విడుదల కావాల్సిన కాంతా చిత్రం విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!