

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రీమియర్ షోల అంశం ఇప్పుడు మెగా అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలకు అనుమతుల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్పెషల్ షోల కోసం రూ.600 టికెట్ ధరకు అనుమతి కోరుతూ ఇప్పటికే దరఖాస్తు సమర్పించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ లభించిందనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ఉత్తర్వులు మాత్రం ఇంకా వెలువడలేదు.
ఇక తెలంగాణలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ షేరింగ్, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘ది రాజాసాబ్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ‘పెద్ది’కి కూడా అదే తరహా అనుమతులు లభిస్తాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!