
గాసిప్స్

సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున భారీ క్రేజ్ ఉన్న రెండు సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. థియేటర్ల సంఖ్య తగ్గడం, టాక్ ప్రభావం, కలెక్షన్లపై ఒత్తిడి వంటి కారణాలతో సాధారణంగా మేకర్స్ పెద్ద సినిమాలను ఒకే తేదీన విడుదల చేయడానికి ఇష్టపడరు. అందుకే కనీసం వారం గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తారు.
అయితే ఈ ఏడాది డిసెంబర్ 24న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ మరియు కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని, ఇండస్ట్రీలో హై వోల్టేజ్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!