

టాలీవుడ్లో కొత్త కాంబినేషన్ రూపుదిద్దుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు నందమూరి బాలకృష్ణకు దర్శకుడు వశిష్ఠ త్వరలో కథ వినిపించనున్నట్లు సమాచారం. సంక్రాంతి 2027 లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశముందని, నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చితే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో అధికారిక ప్రకటన చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, బాలకృష్ణ – హరీష్ శంకర్ కాంబినేషన్లో కూడా సంక్రాంతి 2027 కి సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు భింబిసార 2పై అనిశ్చితి కొనసాగుతుండగా, చిరంజీవి నటిస్తున్న విశ్వంభర విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. వశిష్ఠకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది అనూహ్య పరిణామంగా మారే అవకాశం ఉంది. అయితే భారీ స్థాయిలో సినిమాలను తెరకెక్కించే వశిష్ఠ శైలిని దృష్టిలో ఉంచుకుంటే సంక్రాంతి 2027 లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!