

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని చెన్నై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఈ వార్తను వైరల్‌గా మార్చింది. రజనీ ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారట — ఒకటి సుందర్ సి దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నవంబర్ 7న ప్రకటించవచ్చని టాక్, మరొకటి కమల్ హాసన్‌తో కలిసి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా ఉండబోతోందట. జైలర్ 2 పూర్తయ్యాక నెల్సన్ ఆ ప్రాజెక్ట్ మీద పని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న సినిమా కొంత ఆలస్యమవొచ్చని వార్త. ఈ రిటైర్మెంట్ వార్త నిజమైతే, ఆయన ఆరోగ్య పరంగా ఇది మంచి నిర్ణయమే అవుతుంది. ఏడు పదుల వయసులోనూ అభిమానుల కోసం తలైవర్ అహర్నిశలు కష్టపడుతున్నారు. రోబో సమయంలో అనారోగ్యానికి గురైనా, తిరిగి శక్తివంతంగా సినిమాల్లోకి వచ్చారు. జైలర్ విజయంతో ఆయనకు మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది.
ప్రస్తుతం ఉన్న వయసును బట్టి చూస్తే ఈ రెండు సినిమాలు 2027 వరకు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో హార్రర్ కామెడీలతో గుర్తింపు పొందిన సుందర్ సికి ఎందుకు అవకాశం ఇచ్చారనే సందేహం కొంతమందిలో ఉంది. కానీ అరుణాచలం సినిమాతో మొదలైన వారి అనుబంధం ఈ నిర్ణయానికి కారణమని అంటున్నారు. ఒకవేళ వార్తలు నిజమైతే, అభిమానులు తలైవర్‌ను తెరపై ఇంకో రెండు సార్లే చూడగలరన్న మాట.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!