

ఓటిటీల్లో ఈ వారం “అతివృష్టి–అనావృష్టి” సామెత అచ్చం వర్తిస్తోంది. ప్రతి శుక్రవారం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రావడంతో ఏది చూడాలో ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ వారం అయితే కంటెంట్ ఒక్కసారిగా వెల్లువెత్తి ప్రేక్షకులను కన్ఫ్యూజన్లోకి నెట్టింది.
థియేటర్లలో పనిచేయని సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అదే ప్లాట్‌ఫారమ్‌లో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హిట్ చిత్రం కె ర్యాంప్ ఆహాలో రానుంది, ప్రీమియర్ మెంబర్లకు ముందే యాక్సెస్ ఇస్తున్నారు. జాలీ ఎల్ఎల్బీ 3 స్మార్ట్ స్క్రీన్లలోకి వచ్చేసింది. నరేష్ – రవిబాబు ఏనుగుతొండం ఘటికాచలం ఇప్పటికే ఈటీవీ విన్ లో ఉంది. ఇదిలా ఉంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన దిల్లీ క్రైమ్ మూడో సీజన్ పాజిటివ్ టాక్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఝాన్సీ నటించిన ఈగో కూడా త్వరలో ఈటీవీ విన్ లోకి రానుంది. మళయాళం నుంచి అవిహితం, ఇన్స్పెక్షన్ బంగ్లా లాంటి కొత్త సినిమాలు కూడా మల్టీలాంగ్వేజెస్‌లో వచ్చేశాయి.
ఒకేసారి ఇన్ని రిలీజ్లు రావడంతో ప్రేక్షకులు చూసే కంటెంట్‌ను ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ చూసేయాలంటే కేవలం తీరిక సరిపోదు గంటల తరబడి సమయం కేటాయించాల్సిందే. ఈ కంటెంట్ వరదలో ఏది మొదట ఏది చూడాలి అన్నది పెద్ద సందిగ్ధంగా మారింది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!