

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన వ్యాఖ్యల పై వివరణ ఇచ్చారు. ఇటీవల అవకాశాలు తగ్గడం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీయడంతో, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయుండొచ్చని అన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెహమాన్ ఒక వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు.
భారతదేశమే నా ప్రేరణ, నా గురువు, నా ఇల్లు అని రెహమాన్ పేర్కొన్నారు. తన మాటలను వక్రీకరించారని, అవి తన అసలు ఉద్దేశాన్ని ప్రతిబింబించలేదని తెలిపారు. సంగీతానికి గౌరవం తగ్గుతున్న పరిస్థితుల గురించి మాత్రమే తాను మాట్లాడానని, దానిని మతంతో ముడిపెట్టి వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.
భారత్ తన జీవితానికి, తన సంగీత ప్రయాణానికి స్ఫూర్తి అని మరోసారి నొక్కిచెప్పిన రెహమాన్, తనపై ప్రేమ చూపుతున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!