

వెంకీ కుడుముల తన ప్రొడక్షన్ హౌస్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తొలి నిర్మాణంగా ఇట్లు అర్జునను పరిచయం చేశారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో అనీష్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన సోల్ ఆఫ్ అర్జున గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని సున్నితంగా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచింది.
నాగార్జున వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రేమలోని స్వచ్ఛతను ఆవిష్కరిస్తూ, ధైర్యసాహసాలు, సున్నిత భావాలతో నిండిన అర్జున్ పాత్రను ప్రభావవంతంగా ఆవిష్కరిస్తుంది. అనీష్ తన తొలి ప్రయత్నంలోనే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. యాక్షన్‌తో పాటు భావోద్వేగాల్ని సమతుల్యంగా ప్రదర్శించాడు.
సాంకేతికంగా సినిమాకు బలమైన విలువలు ఉన్నాయి. రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటే, థమన్ నేపథ్య సంగీతం భావాన్ని మరింత లోతుగా తీసుకెళ్తుంది. ప్రేమ, భావోద్వేగం, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఇట్లు అర్జున హృదయాన్ని తాకే కొత్త అనుభూతిని అందించనుందన్న నమ్మకాన్ని ఈ గ్లింప్స్ కలిగిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!