

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ మరియు నయనిక రెడ్డి వివాహ వేడుకలు హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కొకపేటలోని అల్లు స్టూడియోస్ లో సినీ ప్రముఖుల కోసం ఘనమైన ప్రీ వెడ్డింగ్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, నాని, నాగచైతన్య తదితర సినీ తారలు హాజరై సందడి చేశారు. రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల అల్లు వారి నివాసంలో పెళ్లికొడుకు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ – స్నేహారెడ్డి, రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట కూడా వేడుకకు హాజరైంది. ఈ నెల 6, 2026 న ప్రధాన వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరగనుంది. అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డి వివాహ వార్షికోత్సవం కావడం విశేషం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!