

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో బాలీవుడ్ నటి అలియా భట్ తన ఫ్యాషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే సోషల్ మీడియాలో కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రెడ్ కార్పెట్‌పై ఆమె మెరిసినా, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై ఒక నెటిజన్ “అయ్యో పాపం.. ఎవరూ గుర్తించలేదు” అని కామెంట్ చేయగా, అలియా చమత్కారంగా “అయ్యో పాపం ఎందుకు? మీరు నన్ను గుర్తించారు కదా!” అని సమాధానం ఇచ్చారు. ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రోల్స్‌కు ధైర్యంగా సమాధానం ఇచ్చినందుకు అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
మే 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫెస్టివల్లో పలువురు సెలబ్రిటీలు తమ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అలియా భట్‌తో పాటు ఊర్వశీ రౌతేలా కూడా తన ఖరీదైన డ్రెస్‌తో వార్తల్లో నిలిచారు. ఆమె ధరించిన క్రిస్టల్ గౌను విలువ సుమారు రూ.1,491 కోట్లు ఉంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఈసారి కేన్స్ ఫెస్టివల్ గ్లామర్, ఫ్యాషన్, సోషల్ మీడియా ట్రెండ్స్‌తో మరింత హైలైట్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!