
జనరల్

అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కుతోంది. చిత్తూరు ప్రాంత సంస్కృతి, భాష, జీవన విధానాన్ని సహజంగా చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న అఖిల్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు వరుస ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు, అభిమానులతో సమావేశాలు నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కథానాయిక భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్‌కు ఉన్న అనుబంధ దృశ్యాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, వాణిజ్య అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!