

ఏపీ అంతటా ఎక్కడ చూసినా “అఖండ-2” టికెట్ డబ్బులు వాపస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఊహించని విధంగా ప్రీమియర్స్ రద్దు కావడంతో, ఇప్పటికే టికెట్లు తీసుకున్న ప్రజలు థియేటర్ల ముందు క్యూ కట్టారు. కొన్ని ఏరియాల్లో అదే టికెట్ ద్వారా ఉదయం 8 గంటలక షోకి అనుమతిస్తారని చెబుతున్నారు, మరికొన్ని ఏరియాల్లో డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో “అఖండ-2” బుకింగ్స్ చాలా ముందుగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు (GO) రావడంతో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడింది. కానీ ప్రీమియర్స్ రద్దు కావడంతో, ఇప్పుడు టికెట్ మొత్తాలను తిరిగి వెనక్కు ఇస్తున్నారు. ప్రీమియర్స్ రద్దు కారణంగా “అఖండ-2” బ్రేక్ ఈవెన్ స్థితి సందేహంలో పడింది. బాలకృష్ణ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన “అఖండ-2” కోసం నిర్మాతలు డైరెక్టర్ సూచించిన మొత్తం ఖర్చు చేశారు. తాజా సమాచారం ప్రకారం, అఖండ-2కు ఒక్క ఆంధ్రా నుంచే 100 కోట్ల గ్రాస్ రావాలి. ఇందులో 50 కోట్లు సీడెడ్ నుంచి రావాలి. ఆ రేంజ్ లో వస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందనేది ఓ అంచనా. అలా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ప్రీమియర్స్ కచ్చితంగా పడాలి.
కట్ చేస్తే, ఇప్పుడు ప్రీమియర్స్ రూపంలో ఒక్కో టికెట్ పై రావాల్సిన 600 రూపాయల మొత్తం మిస్సయింది. ఇదే ఇప్పుడు బయ్యర్లను భయపెడుతోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!