

నటసింహ నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన పూర్వ చిత్రాలు—సింహా, లెజెండ్, అఖండ—బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ హిట్స్‌గా నిలిచాయి. ఈ విజయాల నేపథ్యంలో వస్తోన్న ‘అఖండ-2’ బాలకృష్ణ కెరీర్‌లోని మొదటి పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోవడం మరింత సెన్సేషన్‌ను సృష్టిస్తోంది. దాంతో సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ఈ చిత్రానికి విశేషమైన బజ్ ఏర్పడింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘అఖండ 2 – తాండవం’ బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ సాధించిన చిత్రంగా నిలిచేలా ఉంది. ఈ సినిమాకు దాదాపు ₹150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు, అలాగే OTT రైట్స్ మాత్రమే ₹85 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు. దీనితో సినిమా క్రేజ్ మరింత పెరిగింది.
పాన్ ఇండియా ప్రమోషన్లలో బాలకృష్ణ స్వయంగా పాల్గొంటూ దేశవ్యాప్తంగా బజ్‌ను పెంచుతున్నారు. తొలి ప్రమోషన్ ముంబైలో ప్రారంభమై అక్కడే టైటిల్ సాంగ్ విడుదల చేశారు. అనంతరం విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్లో ‘జాజికాయ…’ పాటను ఆవిష్కరించారు. తరువాత కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో ట్రైలర్ లాంచ్ నిర్వహించగా, కనడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీమ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి ప్రత్యేకంగా రూపొందించిన త్రిశూలాన్ని బహూకరించింది. ఈ కార్యక్రమాలన్నీ సౌత్, నార్త్ మొత్తంలో ‘అఖండ-2’ కి అపార క్రేజ్‌ను సృష్టించాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!