

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరుకానుంది. మే 22న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కనిపించిన ఐశ్వర్య ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాన్స్ 2026 క్లోజింగ్ సెరిమనీ కోసం బయల్దేరిన ఆమె స్టైలిష్ ఆల్-బ్లాక్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ధ్రువ్ కపూర్ డిజైన్ చేసిన బ్లేజర్ సూట్, గూచీ డయానా బ్యాగ్, సిగ్నోరియా బూట్స్‌తో ఐశ్వర్య ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యంత గుర్తింపు పొందిన భారతీయ సెలబ్రిటీలలో ఐశ్వర్య రాయ్ ఒకరు. ఈసారి కూడా ఆమె రెడ్ కార్పెట్ లుక్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సిగ్నేచర్ రెడ్ లిప్స్, మినిమల్ స్టైలింగ్‌తో ఆమె ట్రావెల్ లుక్ సోషల్ మీడియాలో ఫ్యాషన్ చర్చలకు దారితీసింది. ప్రస్తుతం అభిమానులు ఆమె కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!