
సినిమాలు

డండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణలు తెలియజేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు అధికారిక ప్రకటన విడుదల చేశారు. హీరోయిన్ల భద్రత అంశంపై మాట్లాడిన సమయంలో ఉపయోగించిన కొన్ని పదాలపై శివాజీ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు అసోసియేషన్ తెలిపింది. తన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, మాటలు తగినవిగా లేవని ఆయన అంగీకరించారు.
తన క్షమాపణ సందేశంలో శివాజీ మహిళలను మహాశక్తిగా భావిస్తానని, వారికి ఎల్లప్పుడూ గౌరవం ఇస్తానని పేర్కొన్నారు. తాను ఉపయోగించిన పదాలు తప్పని, వాటివల్ల ఎవరికైనా మనోవేదన కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. శివాజీ క్షమాపణలను స్వీకరించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, అధ్యక్షుడు మంచు విష్ణు ఈ అంశం ఇక ముగిసినదిగా భావిస్తూ, వివాదానికి తెరపడినట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!