

కర్నూలులో ఘనంగా నిర్వహించిన ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ వేడుకలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమానులతో గాఢమైన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో నేను ఒక్క హీరోగా కాదు ప్రతి అభిమాని భావాన్ని తెరమీద చూపించే వ్యక్తిని, అని రామ్ భావోద్వేగంగా పేర్కొన్నారు. రామ్ మరియు భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటించిన ఈ చిత్రం టీజర్, పాటలతోనే భారీ హైప్ సృష్టించింది. ట్రైలర్ విడుదల ఈవెంట్‌ను కర్నూలులో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా అలరించిన డ్రోన్ షో మరింత ప్రత్యేకం చేసింది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27వ తేదీన సినిమా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన నిమిషాల్లోనే అభిమానుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఆ వేడుకలో మాట్లాడిన రామ్, ఈ సినిమా తనకు ఎందుకు అంత ప్రత్యేకమో వెల్లడించారు. తండ్రి భావం, తల్లి భావం, ప్రేమ కథ ఇవి అన్నింటికంటే ఎక్కువగా ఆంధ్రా కింగ్ తాలూకాలో ఉన్న భావోద్వేగం హృదయాన్ని తాకుతుందన్నారు.
తాను ఈ స్థాయికి రావడానికి పూర్తిగా అభిమానుల ప్రేమే కారణమని, వారి అండతోనే తన ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ ఎలాంటి రాజీపడకుండా మంచి సినిమాలను అందించే బ్యానర్ అని ప్రశంసించారు. థియేటర్లలో అందరికీ దగ్గరగా అనిపించే, బలమైన భావోద్వేగ అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని రామ్ నమ్మకం వ్యక్తం చేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
రామ్ మాస్ & క్లాస్