

అతడు ఒక మధ్యస్థ స్థాయి హీరో. పెద్దగా హిట్స్ లేవు, వరుసగా రిలీజ్లు లేవు. ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ ఉన్న సమయంలో కొత్త ప్రాజెక్ట్ ఒకటి చర్చలోకి వచ్చింది. దర్శకుడు ఒకరు సిఫారసు చేయడంతో నిర్మాత కూడా ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అయితే కమర్షియల్ చర్చలు ప్రారంభమైన వెంటనే అసలు షాక్ బయటపడింది హీరో 18 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడు.
ఈ మాట విన్న నిర్మాత షాక్ అయ్యాడు. సినిమా మొత్తం ఖర్చు 30 కోట్లలోపు పూర్తవుతుందని లెక్కలు వేసుకున్నాడు. థియేట్రికల్ నుండి 10 కోట్లు, నాన్-థియేట్రికల్ నుండి 15 కోట్లు వస్తాయని ఊహించాడు. అంటే మొత్తం 5 కోట్ల రిస్క్ మాత్రమే ఉండేది. కానీ హీరో ఒక్కడే 18 కోట్లు అడగడంతో వెంటనే ప్రాజెక్ట్ను వదిలేయాల్సి వచ్చింది.
ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది హీరోలకు గ్రౌండ్ రియాలిటీ అర్ధం కావడం లేదు. కొందరు మాత్రం ఇప్పుడు అర్థం చేసుకుంటూ పార్ట్ పేమెంట్, ప్రాఫిట్ షేరింగ్ వంటి మోడల్స్ వైపు మారుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో, పెద్ద హిట్ లేకుండా, బలమైన లైనప్ లేకుండా ఒక హీరో 18 కోట్లు ఎలా అడగగలడు అన్న ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!