

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు విజయ్ ఆంటోనీ మరో ఆసక్తికర చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ము. మారన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన ప్రీతి కథానాయికగా నటిస్తున్నారు.
నటుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు స్వయంగా సంగీతం అందిస్తున్నారు. పండగ సీజన్‌కు అనుగుణంగా వినోదాత్మక చిత్రంగా ‘నాన్న కుట్టి’ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరిప్రియ, బక్స్, అరువి మదన్, ముత్తుకుమార్, దివాకర్, లిజ్జీ ఆంటోనీ, మూన్నార్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!