
సినిమాలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో కేంద్ర ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్త్ అడ్వైజరీ జారీ చేయబడింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) మార్గదర్శకాల ప్రకారం ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భారత్‌లో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎబోలా గాలి ద్వారా వ్యాపించదని, కేవలం శారీరక ద్రవాల ద్వారా మాత్రమే సంక్రమిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!