

చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ నిపుణులు దీనిని ఖండిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే టానిన్లు కడుపులో యాసిడ్ స్థాయిని పెంచి ఎసిడిటీ, మంట, వికారం వంటి సమస్యలకు దారితీస్తాయి. కొందరిలో మలబద్ధకం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాతే గ్రీన్ టీ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీని హెర్బల్ డ్రింక్‌గా పరిగణించినప్పటికీ, అందులో స్వల్పంగా కెఫిన్ ఉంటుంది. రాత్రి సమయంలో దీనిని తాగితే మెదడు చురుగ్గా మారి నిద్రలేమి సమస్య కలిగించవచ్చు. కాబట్టి రాత్రిపూట తాగాలనుకుంటే, నిద్రకు కనీసం 3 గంటల ముందే తాగడం మంచిది. జీర్ణక్రియ కోసం తీసుకునే వారు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
గ్రీన్ టీ ఆహారంలోని ముఖ్యమైన పోషకాలు, ముఖ్యంగా ఐరన్ శోషణను తగ్గిస్తుంది. అందుకే భోజనం చేసిన వెంటనే తాగకూడదు. భోజనానికి గంట ముందు లేదా 45–60 నిమిషాల తర్వాత తాగడం ఉత్తమ సమయం. గ్రీన్ టీని మరిగించకుండా వేడి నీటిలో వేసి 2–3 నిమిషాల పాటు మాత్రమే ఉంచాలి. రోజుకు 2–3 కప్పులు మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!