

మహిళల్లో విస్తృతంగా కనిపించే పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)కు ఇటీవల పీఎంఓఎస్ (పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్)గా పేరు మార్చడం వెనుక కీలక వైద్య కారణాలు ఉన్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ రిష్మా పాయ్ తెలిపారు. ఈ వ్యాధి కేవలం సంతానోత్పత్తి సమస్య కాదని, మధుమేహం, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆమె వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరిని ఈ సమస్య ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
భారత్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్లు, పెరుగుతున్న వంధ్యత్వ సమస్యలతో పాటు పీఎంఓఎస్ ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్య వివాహాలు, ఆలస్యంగా పిల్లల ప్రణాళిక, జీవనశైలి మార్పులు, ఊబకాయం వంటి అంశాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. పీఎంఓఎస్ బాధితులకు ముందస్తు వైద్య పరీక్షలు, జీవనశైలి మార్పులు, సమగ్ర చికిత్స అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!