

శీతాకాలంలో చల్లని వాతావరణం, పొగమంచు కారణంగా చాలా మందికి ఉదయం వాకింగ్ చేయాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. అయితే డాక్టర్ల మాటల ప్రకారం, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నిపుణుల సూచనల ప్రకారం, చల్లని వాతావరణంలో నడక చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది, రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, అలాగే షుగర్, బీపీ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. సూర్యోదయం తర్వాత వాతావరణం తేలికపడినప్పుడు వాకింగ్ చేయాలి. ముందుగా ఇంట్లో తేలికపాటి స్ట్రెచింగ్ చేసి, వేడి దుస్తులు ధరించాలి. నెమ్మదిగా నడక ప్రారంభించి తర్వాత వేగం పెంచాలి. అస్వస్థతగా అనిపిస్తే వెంటనే ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!