

గొంతు నొప్పి, దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారు ఐస్‌క్రీమ్ తినడంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో గాలిలో తేమ తగ్గిపోవడంతో, ఐస్‌క్రీమ్ తినడం వల్ల గొంతు మరింత ఎండిపోవడం, అసౌకర్యం పెరగడం, వైరల్ ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉండొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారికి ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చని చెబుతున్నారు.
అయితే పూర్తిగా మానాల్సిన అవసరం లేదని, కానీ పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఐస్‌క్రీమ్ తినడం, నెమ్మదిగా ఆస్వాదించడం మంచిదని డాక్టర్లు అంటున్నారు. అలాగే ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత గోరువెచ్చని నీరు లేదా పాలు తాగితే గొంతు సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు. జలుబు, దగ్గు ఉన్న సమయంలో ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిదని వైద్యుల సలహా.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!