

గత కొన్ని రోజులుగా గుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్ నైట్రోఫ్యూరాన్ అవశేషాలు ఉండి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పుకార్లపై FSSAI కీలక ప్రకటన విడుదల చేసింది.
FSSAIతో పాటు వైద్య నిపుణులు ఈ వాదనలను పూర్తిగా ఖండించారు. డాక్టర్ల ప్రకారం, భారతదేశంలో విక్రయిస్తున్న గుడ్లు పూర్తిగా సురక్షితమైనవే. రోజూ గుడ్లు తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, గుడ్లు పూర్తి ప్రోటీన్ మూలం. వీటిలో విటమిన్ A, B12, D, E, ఐరన్, జింక్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల బలం, మెదడు ఆరోగ్యం, కంటి చూపు, ఎముకల బలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలకు గుడ్లు ఎంతో ప్రయోజనకరం అని డాక్టర్లు చెబుతున్నారు.
FSSAI ప్రకారం, కోళ్ల మరియు గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వినియోగం పూర్తిగా నిషేధించబడింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, తక్కువ స్థాయిలో అవశేషాలు ఉన్నా కూడా క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
డాక్టర్ల సూచన ప్రకారం, ఉడికించిన గుడ్లు లేదా తక్కువ నూనెతో తయారు చేసిన గుడ్లు ఆరోగ్యానికి మంచివి. వేయించిన గుడ్లను మాత్రం పరిమితంగా తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలతో కలిసి గుడ్లు తినడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!