

భారతీయ ఇళ్లలో కర్పూరానికి ఆధ్యాత్మికంగా, ఔషధపరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. కర్పూరం వెలిగించడం వల్ల నెగటివిటీ తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. మార్కెట్లో కృత్రిమ కర్పూరం, సహజ భీమ్సేని కర్పూరం అనే రెండు రకాలు లభిస్తాయి. సహజ కర్పూరాన్ని పూజలతో పాటు ఆరోగ్య చిట్కాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.
భీమ్సేని కర్పూరం తలనొప్పి తగ్గించడంలో, చర్మ సమస్యలు మరియు మొటిమలు నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగిస్తే చుండ్రు తగ్గుతుంది. ఆవిరి రూపంలో పీల్చితే జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడకు ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అయితే వైద్య నిపుణులు సహజ కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!