
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్‌గా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఆ తరువాత యుఫోరియా సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ధురంధర్ 2 విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే బాలీవుడ్‌లో తాజాగా ఒక గాసిప్ వైరల్ అవుతోంది. పంజాబీ జానపద ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న "హీర్ రాంఝా" సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించబోతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారని, అందులో సారా “హీర్” పాత్రలో కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. ఈ గాసిప్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది.
అయితే ఈ వార్తలపై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. సారా ఇప్పటివరకు ఏ కొత్త సినిమాకూ సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం అందరూ ధురంధర్ 2 విడుదలపై దృష్టి పెట్టారని, సారా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుంటే తానే ప్రకటిస్తానని చెప్పారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!