

రాకింగ్ స్టార్ యశ్ ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ కోసం మరో కీలక బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్న ఆయన, ఇప్పుడు తన సొంత రాష్ట్రం కర్ణాటకలో సినిమా పంపిణీ బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు. తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘టాక్సిక్’ సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన యశ్‌కు, ‘రామాయణం’ రెండో డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కానుంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. యశ్ కర్ణాటకలో పంపిణీ బాధ్యతలు చేపట్టడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!