27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

Writer: Harika S 05:24 AM, 27 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్‌లోని పోచారంలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసిన రెండో క్యాంపస్‌ను అక్టోబర్ 30న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కంపెనీ ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు ఇన్ఫోసిస్ వర్గాలు తెలిపినట్లు కథనం పేర్కొంది. తొలుత గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ సమీపంలో మొదటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన సంస్థ, అనంతరం పోచారంలో కార్యకలాపాలను విస్తరించింది. కొత్త క్యాంపస్‌ను సుమారు రూ.800–900 కోట్ల వ్యయంతో నాలుగు టవర్లుగా నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 40 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా సదుపాయాలు కల్పించారు. తొలిదశలో దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ ప్రాంగణం ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డిజిటల్ సేవలు, అంతర్జాతీయ ఖాతాదారులకు ఐటీ సేవలు అందించనున్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త క్యాంపస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. సౌర విద్యుత్ వినియోగానికి ఏర్పాట్లు చేయడంతో పాటు, సంస్థకు చెందిన 437 ఎకరాల భూమిలోని నీటి కుంటలు, కొన్ని రకాల చెట్లను సాధ్యమైనంతవరకు తొలగించకుండా భవనాలు నిర్మించినట్లు సమాచారం. దీంతో స్థానిక పక్షి జాతుల ఆవాసాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. క్యాంపస్ ప్రత్యేకతలను వివరించే డాక్యుమెంటరీని కూడా ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2008లో ఏపీఐఐసీ ద్వారా భూమిని కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్, పోచారం ప్రాంగణంలో తొలుత సుమారు రూ.1,250 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2025 జనవరిలో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా క్యాంపస్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అనుమతులను వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విస్తరణతో పోచారం, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు, రవాణా, ఆహార సేవలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనాలో వివో Y600 5G లాంచ్

చైనాలో వివో Y600 5G లాంచ్

ఏఐ భద్రతపై బ్రిటన్‌ నివేదికలో కీలక హెచ్చరిక..

ఏఐ భద్రతపై బ్రిటన్‌ నివేదికలో కీలక హెచ్చరిక..

గూగుల్‌ ప్రైవసీ పాలసీలో కీలక మార్పు..

గూగుల్‌ ప్రైవసీ పాలసీలో కీలక మార్పు..

ఇక టీవీ స్క్రీన్‌పైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

ఇక టీవీ స్క్రీన్‌పైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో దూసుకెళ్తున్న మారుతి ఫ్రాంక్స్.. బ్రెజాను దాటిన అమ్మకాలు
ట్యాగ్లు
ఇన్ఫోసిస్ హైదరాబాద్పోచారం క్యాంపస్తెలంగాణ ఐటీ రంగంఐటీ ఉద్యోగాలురేవంత్ రెడ్డిసాంకేతిక పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో దూసుకెళ్తున్న మారుతి ఫ్రాంక్స్.. బ్రెజాను దాటిన అమ్మకాలు

హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే 7 వేరియంట్ల వివరాలు లీక్!

హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే 7 వేరియంట్ల వివరాలు లీక్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 33 ఓట్లు!
జనరల్

సోషల్ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 33 ఓట్లు!

నీటి ఎద్దడితో మిర్చి పంటకు మురుగునీరు.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతులు!
జనరల్

నీటి ఎద్దడితో మిర్చి పంటకు మురుగునీరు.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతులు!

యూపీ ఓటర్ల జాబితాలో వింత అనువాదం.. ‘రామ్‌హిత్ యాదవ్’ పేరుపై వివాదం!
రాజకీయాలు

యూపీ ఓటర్ల జాబితాలో వింత అనువాదం.. ‘రామ్‌హిత్ యాదవ్’ పేరుపై వివాదం!

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!
టెక్నాలజీ

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ రెండో క్యాంపస్ ప్రారంభం.. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగాలు!

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ
రాజకీయాలు

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు.. రిజర్వేషన్లపై కీలక నిర్ణయం!
జనరల్

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు.. రిజర్వేషన్లపై కీలక నిర్ణయం!

అక్టోబర్ 30న ‘కల్ట్’ రిలీజ్.. భారీ స్థాయిలో థియేట్రికల్ ప్లాన్ చేసిన మేకర్స్!
సినిమాలు

అక్టోబర్ 30న ‘కల్ట్’ రిలీజ్.. భారీ స్థాయిలో థియేట్రికల్ ప్లాన్ చేసిన మేకర్స్!

జయకృష్ణ రెండో సినిమా ఫిక్స్?
గాసిప్స్

జయకృష్ణ రెండో సినిమా ఫిక్స్?

‘ఫలక్‌నుమా దాస్’ రీమేక్ హక్కులపై విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘ఫలక్‌నుమా దాస్’ రీమేక్ హక్కులపై విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు..
ఓటీటీ

ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు..

పావాగఢ్ మహాకాళి ఆలయం.. 500 ఏళ్ల తర్వాత ఎగిరిన పవిత్ర ధ్వజం వెనుక చరిత్ర ఇదే!
జనరల్

పావాగఢ్ మహాకాళి ఆలయం.. 500 ఏళ్ల తర్వాత ఎగిరిన పవిత్ర ధ్వజం వెనుక చరిత్ర ఇదే!

పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర.. సిరిమానోత్సవం వెనుక పవిత్ర గాథ ఇదే!
జనరల్

పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర.. సిరిమానోత్సవం వెనుక పవిత్ర గాథ ఇదే!