

‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘ధర్మన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, సిమ్రాన్, రామ్ పోతినేని కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. లోకనాయకుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అందులో రజినీకాంత్ చేతిలో రక్తపు మరకలున్న సర్జికల్ కత్తితో ‘ది డెడ్లీ డాక్టర్’గా కనిపించి తన పాత్రపై ఉత్కంఠను రేకెత్తించారు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం ఆమె భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించి, రజినీకాంత్, నయనతార ఎదురెదురుగా నిలబడి ఉన్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసినట్లు సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ చిత్రాల తర్వాత రజినీకాంత్, నయనతార కలిసి నటిస్తున్న ఐదో సినిమా ఇదే కావడం విశేషం. స్టార్ నటీనటులు, అనిరుధ్ సంగీతం కలయికతో ‘ధర్మన్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!