

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినగానే భారీ అంచనాలు సహజం. ఆయన నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్ జనవరి 9 న విడుదలై మొదట్లోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌తో చూపించడం మొదట మంచి హైప్ తీసుకొచ్చినా, కథనం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా విమర్శలు ఎక్కువయ్యాయి.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ట్రేడ్ అంచనాల ప్రకారం సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.205 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసినట్టు సమాచారం. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదని టాక్.
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్లో ఇప్పుడు మరో అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ మరియు ప్రముఖ నిర్మాత టి జీ విశ్వ ప్రసాద్ మధ్య జరిగిన భేటీ. ఈ సమావేశంలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌కు తాను అండగా ఉంటానని ప్రభాస్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. విజయాలు, అపజయాలు సహజమేనని, కష్టకాలంలో కలిసి నిలబడడమే నిజమైన బంధమని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనతో ప్రభాస్‌పై అభిమానుల్లో మరింత గౌరవం పెరిగిందని, ఆయన “మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్” ఇమేజ్ మరింత బలపడిందని టాక్.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!