

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న RC17 సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా కథానాయిక వివరాలను దర్శకుడు సుకుమార్ గోప్యంగా ఉంచుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే చర్చల్లో ఉన్న కొందరు నటీమణులతో పాటు మరికొన్ని పేర్లను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లు కూడా హీరోయిన్‌గా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్కరినీ అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ నెల చివర్లో లేదా డిసెంబర్ ప్రారంభంలో హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇక RC17 రెగ్యులర్ షూటింగ్‌ను ఫిబ్రవరి 2027లో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘రంగస్థలం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రానున్న వారాల్లో చిత్రబృందం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!